Monday, October 14, 2024

Tirumala – చిన్న కుమార్తె కోసం తిరుమ‌ల డిక్ల‌రేష‌న్ పై సంతకం చేసిన ప‌వ‌న్ కల్యాణ్

తిరుమ‌ల – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై ప‌లీనా సంతకం చేసింది. కాగా, పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా పవన్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు. అనంత‌రం శ్రీవారి ద‌ర్శ‌నానికి త‌న ఇద్ద‌రు కుమార్తెల తో క‌ల‌సి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement