తిరుమల – : తుపాను ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి.
15/8 , 14/8 కిలోమీటర్ల వద్ద స్వల్పంగా జారిపడ్డాయి కొండచరియలు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు జేసిబిలతో బండరాళ్లను తొలగిస్తున్నారు టీటీడీ ఇంజినీరింగ్ సిబ్బంది..
తిరుమలలో నిండిన జలాశయాలు
తిరుమలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు దాదాపు పూర్తిగా నిండిపోయాయి.తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి.ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం ఐదు జలాశయాల్లో నీటి మట్టం దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది.
నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.1) పాపవినాశనం డ్యామ్ :- 693.27 మీ.FRL :- 697.14 మీ.
2) గోగర్భం డ్యామ్ :- 2894 అడుగులుFRL :- 2894 అడుగులు
3) ఆకాశగంగ డ్యామ్ :- 855.00 మీFRL :- 865.00 మీ
4) కుమారధార డ్యామ్ :- 890.80 మీFRL :- 898.24మీ
5) పసుపుధార డ్యామ్ :- 896.35మీFRL :- 898.24మీ