Tuesday, April 16, 2024

Tirumala: అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డం.. ప్రోత్స‌హించం. ప్ర‌తిజ్ఞ చేసిన టీటీడీ అధికారులు, ఉద్యోగులు

Tirumala Tirupathi: కేంద్ర విజిలెన్స్ క‌మిష‌న్ (సీవీసీ) పిలుపు మేర‌కు దేశ వ్యాప్తంగా ‌అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు నిర్వ‌హిస్తున్నఅవినీతి వ్య‌తిరేక‌, భ‌ద్ర‌తా అవ‌గాహ‌న వారోత్సవాలను మంగ‌ళ‌వారం టీటీడీ ఈవో డాక్ట‌ర్ కె.ఎస్.జవహర్ రెడ్డి ప్రారంభించారు.

మంగ‌ళ‌వారం ఉద‌యం సీవీఎస్వో గోపినాథ్ జెట్టి ఆధ్వ‌ర్యంలో టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నం వ‌ద్ద అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులతో తాము అవినీతికి వ్య‌తిరేకంగా, సంస్థ ప్ర‌యోజ‌నాలు కాపాడుతూ ప‌నిచేస్తామ‌ని ఈవో ప్ర‌తిజ్ఞ చేయించారు. ఉద్యోగులు, అధికారులు నైతిక ధోర‌ణిని ప్రోత్స‌హిస్తూ, నిజాయి‌తి, స‌మైక్య‌త‌తో పార‌ద‌ర్శ‌క సేవ‌లు అందిస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేశారు.

అక్టోబ‌రు 31న ఉక్కుమ‌నిషి స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ జయంతిని పుర‌స్క‌రించుకుని ప్రారంభ‌మైన ఈ వారోత్స‌వాలు న‌వంబ‌రు 1వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు స‌దా భార్గ‌వి, వీర‌బ్ర‌హ్మం, డిఎల్‌వో రెడ్డ‌ప్ప రెడ్డి, సిఇ నాగేశ్వ‌ర‌రావు, ఎఫ్ఏ అండ్ సిఏవో బాలాజి, అద‌న‌పు సివిఎస్వో శివ‌కుమార్ రెడ్డి, విజివోలు బాలిరెడ్డి, మ‌నోహ‌ర్‌, ఎవిఎస్వోలు సాయి గిరిధర్, క‌ల్ప‌న‌ పాల్గొన్నారు.‌

Advertisement

తాజా వార్తలు

Advertisement