Wednesday, November 6, 2024

Bramotsavas – ముగిసిన తిరుమల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు

సామాన్య భ‌క్తుల‌కు పెద్ద పీఠ‌•⁠ ⁠

సౌక‌ర్య‌వంతంగా శ్రీవారి మూల‌మూర్తి, వాహ‌న సేవ‌ల‌ ద‌ర్శ‌నం•⁠ ⁠

టీటీడి క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల‌పై భ‌క్తుల సంతృప్తి– టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామ‌ల‌రావు

తిరుమల, : శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన‌ట్లు, సామాన్య భ‌క్తుల‌కు ఎలాటి ఆసౌక‌ర్యాం క‌లుగ‌కుండా టీటీడీలోని అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో సేవ‌లందించిట్లు టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు చెప్పారు. టీటీడీ సిబ్బంది సంయ‌మనంతో, ప్ర‌ణాళిక బ‌ద్ధంగా, సీనియ‌ర్ అధికారుల ప‌ర్య వేక్ష‌ణ‌లో సేవ‌లందించార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన సౌక‌ర్య‌ల‌పై భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేశార‌న్నారు.

తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం ఈవో, అద‌న‌పు ఈవో సిహెచ్ వెంక‌య్య చౌద‌రితో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, బ్ర‌హ్మోత్స‌వాల్లో అక్టోబ‌రు 4 నుండి 11వ తేదీ వ‌ర‌కు న‌మోదైన వివ‌రాలు మీడియా కు వెల్లడించారు.

- Advertisement -

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల ముఖ్యాంశాలు•

⁠ ⁠ముఖ్య‌మంత్రి వర్యులు నారా చంద్ర‌బాబు నాయుడు అక్టోబ‌రు 4వ తేదీన శ్రీవారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.-అక్టోబ‌రు 5వ తేదీ పాంచ‌జ‌న్యం విశ్రాంతి భ‌వ‌నం వెనుక వైపున రూ. 13.45 కోట్ల‌తో నూత‌నంగా నిర్మించిన వ‌కుళమాతా వంట‌శాల‌ను ప్రారంభించారు.

.శ్రీవారి ఆలయం :– 6 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

– 15 ల‌క్ష‌ల మంది భ‌క్తులు శ్రీ‌వారి వాహ‌న సేవ‌లు విక్షించారు

.•⁠ ⁠గరుడసేవ నాడు 82,043 మంది దర్శించుకున్నారు. కాగా, గరుడసేవ‌లో దాదాపు 3.5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు

.•⁠ ⁠7 లక్షల లడ్డూలు బఫర్‌ స్టాక్‌.•

⁠ ⁠విక్రయించిన మొత్తం లడ్డూలు 30 లక్షలు

.•⁠ ⁠హుండీ కానుక‌లు రూ.26 కోట్లు.

•⁠ ⁠తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య 2.60 లక్షలు

.•⁠ ⁠భ‌క్తుల‌కు 32,713 గ‌దుల కేటాయించాం.

•⁠ ⁠బ్రహ్మోత్సవాల్లో 475 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం

.– క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద వివిధ విభాగాల ద్వారా ఏర్పాటు చేసిన ఫ‌ల పుష్ప ప్ర‌ద‌ర్శ‌న నాడు -నేడు కాన్సెప్ట్‌తో ఫోటో ఎగ్జిబిష‌న్‌, అట‌వీ, శిల్ప క‌ళాశాల‌ల‌చే ఏర్పాటు చేసిన‌ ఎగ్జిబిష‌న్లు భ‌క్తుల ప్ర‌శంస‌లు అందుకున్నాయి.

– తిరుమ‌ల‌లో ప‌లు ప్రాంతాల్లో దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్ల‌తోపాటు, 32 పెద్ద డిజిట‌ల్ స్క్రీన్లు ఏర్పాటు. ఇందులో నాలుగు మాడ వీధుల‌లో 23, ప్ర‌ధాన కూడ‌ళ్ళ‌లో 9, ప్ర‌త్యేకంగా తిరుప‌తిలో 7 డిజిట‌ల్ స్క్రీన్లు ఏర్పాటు చేశాం.

అన్నప్రసాదం :•⁠ ⁠బ్రహ్మోత్సవాల 8 రోజుల్లో 26 లక్షల భోజనాలు, అల్పాహారం అందించడమైనది

.•⁠ ⁠గరుడసేవనాడు 8.71 లక్షల మందికి అన్నప్రసాదాలు, అల్పాహారం, 3.47 లక్షల మందికి టి, కాఫి, పాలు, బాదం పాలు, 4 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 4 ల‌క్ష‌ల తాగునీరు బాటిళ్ళు, స్నాక్స్‌గా సుండ‌లు, బిస్కెట్లు అందించడం జరిగింది.

వైద్యం :– 45 మంది డాక్టర్లు, 60 మంది పారామెడికల్‌ సిబ్బందిని, 13 అంబులెన్సులు వినియోగించడమైనది.•⁠ ⁠68 వేల మందికి పైగా భక్తులకు వైద్యసేవలు.

ఆరోగ్య విభాగం :•⁠ ⁠తిరుమ‌ల‌లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం 1365 మంది సిబ్బంది, గ‌రుడ సేవ రోజు అద‌నంగా 600 మంది సిబ్బంది ఏర్పాటు

టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టులు :•⁠ ⁠హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 18 రాష్ట్రాల నుండి వ‌చ్చిన 261 కళాబృందాల్లో 6,884 మంది కళాకారులు క‌ళారూపాల‌ను ప్ర‌ద‌ర్శించారు.

వాహ‌న సేవ‌ల‌తో పాటు తిరుమ‌ల‌, తిరుప‌తిలో ప్రదర్శించిన కళాకృతులు విశేషంగా అకట్టుకున్నాయి. భ‌క్తులు ఎంతో సంతోషించారు.

ఉద్యానవన విభాగం :•⁠ ⁠శ్రీవారి ఆలయంతో పాటు ప‌లు కూడ‌ళ్ళు, అతిథి గృహాల వ‌ద్ద శోభాయమానంగా పుష్పాల అలంకరణలు, పుష్పప్రదర్శన.– బ్ర‌హ్మోత్స‌వాల‌లో 40టన్నులు పుష్పాలు, 3.50 లక్షల కట్‌ ఫ్లవర్స్‌, 80 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగం.

ప్రజాసంబంధాల విభాగం :•⁠ ⁠రాంభగీచా-2లో మీడియా సెంటర్, క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద నాడు – నేడు ఫొటో ఎగ్జిబిష‌న్‌ ఏర్పాటు.

•దాదాపు 7 రాష్ట్రాల నుండి విచ్చేసిన 4 వేల‌ మంది శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు.

•⁠ ⁠గ‌తంలో ఉన్న 5 స‌మాచార కేంద్రాల‌తో పాటు తిరుమ‌ల‌లో మ‌రో 5 స‌మాచార కేంద్రాలు, తిరుప‌తిలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశాం.

– అదేవిధంగా భ‌క్తుల‌కు విరివిగా స‌మాచారం ఇచ్చేందుకు శ్రీ‌వారి సేవ‌కుల స‌హ‌కారంతో దాదాపు 11 ప్రాంతాల‌లో మే ఐ హెల్ప్ యు కౌంట‌ర్ల‌ను నిర్వ‌హించాం.

– టీటీడీ కాల్ సెంట‌ర్, క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్, స‌మాచార కేంద్రాలు, మీడియా, శ్రీ‌వారి సేవ‌కుల ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు భ‌క్తుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ వారికి మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించాం.

– తిరుమ‌ల‌లో భ‌క్తుల‌ను ఒక ప్రాంతం నుండి మ‌రోక ప్రాంతానికి ఉచితంగా ర‌వాణా చేసేందుకు 14 ధ‌ర్మ ర‌థాల‌ను ఏర్పాటు చేశాం.

ఎపిఎస్‌ఆర్‌టిసి :– 9.53 ల‌క్ష‌ల మంది ఎపిఎస్‌ఆర్‌టిసి ద్వారా తిరుమ‌ల‌కు రాక పోక‌లు సాగించారు

.– గరుడసేవనాడు ఆర్‌టిసి బస్సులు తిరుపతి నుంచి తిరుమలకు 2,764 ట్రిప్పుల్లో 97,402 మంది భక్తులను చేరవేశాయి.

తిరుమల నుంచి తిరుపతికి 2,711 ట్రిప్పుల్లో 89,181 మంది భక్తులను చేరవేశాయి

.•⁠ ⁠బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌యవంతం చేయ‌డంలో పాలుపంచుకున్న అర్చ‌క స్వాములు, అధికారులు, సిబ్బంది, క‌ళాకారులు, శ్రీ‌వారి సేవ‌కులు, ఎన్‌సిసి విద్యార్థుల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.

– అలాగే, బ్ర‌హ్మోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు అన్నివిధాలా స‌హ‌క‌రించిన జిల్లా యంత్రాంగం, పోలీసు, ఆర్‌టీసీ, ఇత‌ర ప్ర‌భుత్వ విభాగాల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను.– బ్ర‌హ్మోత్స‌వాల వైభ‌వాన్ని భ‌క్తుల‌కు చేరువ చేసిన మీడియా మిత్రుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను.

చివరి రోజున ధ్వజావరోహణం, తిరుచ్చిపల్లకి సేవ

తిరుమల ఆలయంలో ధ్వజావరోహణం వేడుకగా జరిగింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రాత్రి శ్రీమలయప్పస్వామికి తిరుచ్చిపల్లకి సేవ నిర్వహించారు. నేటి ఉదయం దేవదేవుడు కి చక్ర స్నానం చేయించారు

కాగా ఆలయంలో 8 రోజులుగా మలయప్పస్వామికి వివిధ వాహన సేవలు కన్నుల పండువగా జరిగాయి. శ్రీవారు వివిధ అవతారాల్లో భక్తులకు అభయమిచ్చారు. విజయదశమి నేపథ్యంలో ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement