Sunday, October 13, 2024

Tirumala – డిక్లరేషన్‌ వెనుక రాజకీయ కుట్ర : భూమన

తిరుమ‌ల – జగన్‌ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. డిక్లరేషన్‌ అడిగితే ఈ ప్రభుత్వ పతనం ఖాయమనిహెచ్చరించారు. తిరుప‌తిలో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వకపోతే దర్శనానికి అనుమతి లేదనే హక్కు టీటీడీకి లేదని స్పష్టం చేశారు. ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవచ్చని సనాతన ధర్మం చెబుతోందని తెలిపారు.

అలాంటిది ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పట్టువస్త్రాలు సమర్పించిన జగన్‌ను డిక్లరేషన్‌ అడగడం దారుణమని విమర్శించారు. జగన్‌ డిక్లరేషన్‌పై ఇంత రాద్దాంతం జరిగినా చంద్రబాబు మాట్లాడటం లేదని భూమన విమర్శించారు. డిక్లరేషన్‌ వెనుక రాజకీయ కుట్ర ఉందని తెలిపారు. ప్రభుత్వం ఎంత నిర్బంధిస్తే అంత పైకి లేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు పాశవిక విధానాలను వ్యతిరేకిస్తూనే ఉంటామని భూమన తెలిపారు. చంద్రబాబు వెయ్యి నాలుకల ధోరణిని ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement