Thursday, December 5, 2024

Tirumala – టిటిడి పాలక మండలి సభ్యుడిగా బిజెపి నేత భానుప్రకాశ్‌రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడుతో పాటు మరో 24 మంది సభ్యులను ప్రకటించారు.

తాజాగా ఇవాళ దేవాదాయశాఖ విడుదల చేసిన జాబితాలో బిజెపి నేత జి.భానుప్రకాశ్‌రెడ్డి పేరు చేర్చారు. దీంతో 25 మంది తో జీ ఓ ను విడుదల చేసారు

కాగా ఎక్స్‌అఫిషియో సభ్యులుగా దేవాదాయశాఖ కార్యదర్శి, దేవాదాయశాఖ కమిషనర్‌, తుడా ఛైర్మన్‌, టీటీడీ ఈవో కొనసాగనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement