Sunday, September 24, 2023

Tirumala : ఘాట్ రోడ్డులో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు..

తిరుమల ఘాట్ రోడ్డులో నిబంధనలు అతిక్రమిస్తే ఆ వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా, తిరుమలకు ఆ వాహనాలను నిషేధిస్తామని తిరుమల అడిషనల్‌ ఎస్పీ మునిరామయ్య తెలిపారు. తిరుమ‌ల ఘాట్ రోడ్డులో ప్ర‌మాదాల‌పై అధికారులు దృష్టి పెట్టారు. మంగళవారం తిరుమలలోని ట్రాఫిక్ పోలీసు స్టేషనులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ మునిరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల ఘాట్ రోడ్డులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు టీటీడీ చర్యలు ప్రారంభించిందని చెప్పారు.

- Advertisement -
   

తిరుమల ట్రాఫిక్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారుల నేతృత్వంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసిందన్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో డ్రైవింగ్ పై వాహనదారులకు అవగాహన లేకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, సెల్ ఫోన్ డ్రైవింగ్, అతివేగం కారణాల వ‌ల్ల‌ స్వల్ప రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అంతే కాకుండా సెల్ఫీలు తీసుకోవడం కోసం రోడ్డు పక్కన వాహనాలు ఆపడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఘాట్ రోడ్డులో అవగాహన కలిగిన డ్రైవర్లు మాత్రమే వాహనాలు నడపాలని, డ్రైవర్లకు అవగాహన కల్పించే విధంగా తిరుమల ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాలలో సూచనలు, సలహాలు ఇచ్చే విదంగా చర్యలు చేపట్టామని అడిషనల్ ఎస్పీ మునిరామయ్య అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement