Thursday, April 25, 2024

Southern zonal council meet: నిఘా నీడలో తిరుపతి నగరం!

దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం ఆదివారం(నవంబర్ 14) తిరుపతి నగరంలోని తాజ్ హోటల్ లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులుతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ లు రానున్నారు. ఈ నేపథ్యంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశం జరగనున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. డి.ఎస్.పిస్థాయి అధికారులతో సమన్వయ నోడల్ ఆఫీసర్ ను నియమించారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ. తెలంగాణ. కర్ణాటక. కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పుదుచ్చేరి. అండమాన్ నికోబార్. లక్షద్వీప్. లెఫ్ట్ గవర్నర్లు కూడా హాజరుకానున్నారు…

దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశానికి 2500 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తు కి రాయలసీమ జిల్లాలతోపాటు తిరుపతి అర్బన్, చిత్తూరు జిల్లాల పోలీసులను బందోబస్తుకు ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలను కూడా చుట్టుపక్కల ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆరాధిస్తున్నారు. ఈ సమావేశం జరిగే ప్రాంతాల్లో చుట్టుపక్కల 14 చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు.

తిరుపతి నగరంలోని లాడ్జిలు, బస్టాండ్లు రైల్వే స్టేషన్, గెస్ట్ హౌస్ లను విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అలాగే వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇతర రాష్ట్రాలు వాహనాలు కూడా తనిఖీలు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి విధులు నిర్వహిస్తున్న టువంటి సిబ్బంది నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కల్వర్టులు, రోడ్డు మార్గాల్లో డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.

ఇది కూడా చదవండి: ప్రమాదంలో డిస్కంల మనుగడ: ప్రభుత్వానికి ఏపీఈర్సీ లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement