ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు సమీపంలో పులి సంచారం కలకలం రేపింది. రాత్రి పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలో పులి సంచరించింది. పులి సంచరించిన ఆనవాళ్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పులి సంచరించిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు సమీపంలో పులి సంచరించిన విషయం తెలియడంతో ఆ ప్రాంత వాసులు, పోలవరం ప్రాజెక్టు సిబ్బంది భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -