Wednesday, April 24, 2024

శ్రీశైలం దారిలో పెద్దపులి.. ప్రయాణికుల కారు ముందు 20నిమిషాలు..

శ్రీశైలం, ప్రభ న్యూస్: శ్రీశైలం ఆలయ ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి పెద్ద పులి హల్ చల్ చేసింది. ఒక చోట‌ రోడ్డు దాటుతూ ప్రయాణికులకు పెద్దపులి తారసపడింది. వాహనంలో వెళుతున్న వారు మొదట ఆవు గా భావించి వాహనాన‌ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు.

ఆ తర్వాత పెద్దపులి గా గుర్తించి రోడ్డుపైనే వాహనాలను నిలిపివేశారు. కొద్దిసేపటి వరకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వాహనంలోనే గడిపారు. ఆ వాహ‌నాల‌ను చూసి కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించింది పెద్దపులి. దీంతో మ‌రింత భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు ప్రయాణికులు. దాదాపు ఇరవై నిమిషాలు రోడ్డుపై బైఠాయించిన పులి ఆ తర్వాత అక్కడ నుంచి చెట్లపొదల్లోంచి రోడ్డు మీదుగా అడవిలోకి వెళ్ళిపోయింది. ఈ సన్నివేశాన్ని కొందరు ప్రయాణికులు సెల్ ఫోన్ల‌లో చిత్రీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement