Saturday, June 3, 2023

అల్లూరి జిల్లాలో పులి సంచారం.. భయాందోళనలో గిరిజనులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోని అనంతగిరి మండలం రొంపల్లి ఎస్‌ఆర్‌పురంలో మూడు ఆవులను పులి చంపింది. సోముల అప్పలరాజు, సోముల రామారావుకు చెందిన మూడు ఆవులను పులి చంపేసింది. పులి సంచారంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో విద్యుత్ లేని కారణంగా గిరిజనలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఫారెస్ట్ అధికారులే తమకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పులి దాడులు చేయడంతో తామెలా బతకాలంటూ గిరిజనులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement