Thursday, April 25, 2024

AP | టిఫా స్కానింగ్‌తో గర్భిణులకు మేలు.. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఉచితం: మంత్రి రజిని

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్‌ ఆస్పత్రుల్లో గర్భిణులకు ఆల్ట్రాస్రౌండ్‌, టిఫా స్కానింగ్‌ సేవలు ఉచితంగా అందించబోతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు విడదల రజిని అన్నారు. ఆరోగ్యశ్రీ అమలవుతున్న గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ సేవలను శుక్రవారం మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. తొలుత మంత్రి స్కానింగ్‌ లు చేస్తున్న తీరును స్వయంగా తెలుసుకున్నారు. గర్భిణిలతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారికి పౌష్టికాహార కిట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో ఖరీదైన ఈ సేవలను ఇప్పటివరకు రోగులు డబ్బులు చెల్లించి చేయించుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడు ప్రభుత్వమే ఈ ఖర్చు భరిస్తుందని తెలిపారు.

ఏటా 64వేల మందికిపైగా టిఫా స్కానింగ్‌ అవసరం ఉంటు-ందని భావిస్తున్నామని, అందుకు దాదాపు 7 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని ఇకపై ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. వైద్యుడు సిఫారుసు చేసిన ప్రతి ఒక్కరికి టిఫా స్కానింగ్‌ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తారని చెప్పారు. టిఫా స్కానింగ్‌ ద్వారా జన్యు లోపాలు, శిశువు అవయవలోపాలు, పిండంలో లోపాలు, పిండం ఎదుగుదుల వంటి వాటిని పూర్తి స్థాయిలో ముందే తెలుస్తుందన్నారు. పిండం ఎదుగుదలలో ఏవైనా అనుమానాలున్నా, గర్భిణిల కుటు-ంబ నేపథ్యం, వారి మెడికల్‌ హిస్టరీ.. ఇలా పలు అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ టిఫా స్కానింగ్‌ ను వైద్యులు సిఫారసు చేస్తారన్నారు.

అల్ట్రా స్కానింగ్‌ ప్రతి గర్భిణికి రెండు సార్లు చేయాల్సిన అవసరం ఉంటు-ందన్నారు. 2022-23లో ఆరోగ్యశ్రీ కింద 2.32 లక్షల కాన్పులు ఉచితంగా చేశామని, కేవలం గర్భిణి లకు చికిత్స అందించేందుకే రూ.247 కోట్లు- వెచ్చించామని వివరించారు. సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ లాంటి పథకాల ద్వారా గర్భిణులకు నాణ్యమైన ఆహారాన్ని ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమలో ఎమ్మెల్యేలు షేక్‌ ముస్తఫా, మద్దాలి గిరి, ఆరోగ్యకుటు-ంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జె.నివాస్‌, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంధర్‌ ప్రసాద్‌, కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement