Saturday, April 20, 2024

సోమశిల ప్రాజెక్టు.. నెల్లూరు భవిష్యత్తు!

సోమశిల ప్రాజెక్టు పనులను పరుగులెత్తించేందుకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి “త్రిసభ్య కమిటీ” ఏర్పాటు చేశారు. ఫేజ్-1,2లలో భూసేకరణ సమస్య సహా ప్రాజెక్టు చుట్టూ ముడిపడి ఉన్న ఇబ్బందులన్నీ తొలగించేలా ఎప్పటికప్పుడు ముగ్గురు సభ్యుల కమిటీ పనిచేయనుంది. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా అటవీ శాఖ అధికారి ఎ.నాగేంద్ర, నెల్లూరు జిల్లా జలవనరుల శాఖ కు చెందిన సూపరింటెండింగ్ ఇంజనీర్ కృష్ణా రావు సభ్యులుగా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. సోమశిల పనుల్లో వేగం.. ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా ఈ కమిటీ పని చేయనుంది.

కమిటీ సభ్యులతో తొలి సమావేశం  నిర్వహించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి… సోమశిల, కండలేరు, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ అమలు, ఫేజ్-2 పనులు, దక్షిణ కాలువ విస్తరణ, అటవీశాఖ నిబంధనల అమలు వంటి పనులను ఎలా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలో దిశానిర్దేశం చేశారు.

ప్రతి వారం త్రిసభ్య కమిటీ సమావేశమై ఎప్పటికప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను తొలగించాలని ఆదేశించారు. సమయాన్ని నిర్దేశించుకుని ఎప్పటికప్పుడు తనకు పురోగతి చూపించాలని జాయింట్ కలెక్టర్ కి సూచించారు. రెండు రోజుల సమయం ఇస్తే సోమశిల ప్రాజెక్టు పూర్తికి  చేపట్టవలసిన చర్యలు ప్రణాళిక కార్యాచరణను సిద్ధం చేస్తామని మంత్రి మేకపాటికి తెలిపిన జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రజల ఆశలను నెరవేర్చే బాధ్యత మీదేనని మంత్రి వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement