Thursday, March 28, 2024

మూడు రాజధానులే కావాలి.. రాయలసీమ అభివృద్ధికి శ్రీబాగ్‌ ఒప్పందమే దిక్సూచి

రాయలసీమ, ప్రభన్యూస్‌: మూడు రాజధానులే ముద్దు.. ఒక రాజధాని వద్దని రాయలసీమ లోని ఎమ్మెల్యేలు, కమ్యూనిస్టు పార్టీలు డిమాండ్‌ చేశాయి. బుధవారం కర్నూలుతో పాటు వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం, తిరుపతి, శ్రీ సత్యసాయి, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రజా కూటమి నేతృత్వంలో శ్రీబాగ్‌ ఒప్పంద అమలుకై ఉద్యమం ఎగిసిపడింది. ఇందులో భాగంగా అన్ని జిల్లాలో ప్రధాన కూడళ్లలో ప్రజా కూటమీ నేతృత్వంలో మానవహారం నిర్వహించారు. ఇందుకు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఇంచార్జిలు, విద్యార్ధులు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. వీటిద్వారా రాష్ట్రంలో మూడు రాజధానుల ఆవశ్యకతను తెలియజేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో 7వేల నుం చి 10వేత మందికి పైగా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.

ఈసందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీబాగ్‌ ఒప్పందం రాయలసీమకు దిక్చూచి లాంటిదన్నారు. రాయలసీమ లోనే రాజధానిని ఏర్పాటు- చేయాలన్నారు. రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమాలు ఉప్పెన లా లేస్తాయని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా ఏకమవ్వాల్సిన సమయం అసన్నమైందని అందరు కదలి రావాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకే వికేంద్రీకరణ చేస్తున్నారని, భవిష్యత్‌లో వేర్పాటు-వాదం రావొద్దన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచిస్తున్నారని చెప్పారు. గతంలో కర్నూలుకు హైకోర్టు కావాలన్న నోళ్లు ఇప్పుడెందుకు మూగబోయాయని ప్రశ్నించారు. ఒక ప్రాంత అభివృద్ధితో భవిష్యత్‌ తరాలకు తీవ్ర నష్టం జరుగుతుందని వికేంద్రీకరణ సమయంలోనే మన హక్కులు సాధించుకుందామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement