Wednesday, March 27, 2024

Big Story: ఏదో అనుకుంటే.. ఇట్లా జరుగుతుందేటి.. ఏపీలో అంతా గందరగోళం..

ఆంధ్రప్రదేశ్ లో అంతా మంచే జరుగుతుందనుకుంటే ఒక్కొక్కటికీ జగన్ ప్రభుత్వానికి వెనక్కి తంతున్నాయి. తొలినాళ్లలో పాలన అంతా బాగుంది అన్నవారే.. ఇప్పుడు ‘‘ఛ.. ఇదేంటబ్బా’’ అంటూ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏపీలో ఏం జరుగుతోంది.. జగన్ పరిపాలన జనాలకు ఎందుకు నచ్చట్లేదు.. ఓసారి పరిశీలిద్దాం..

  • సచివాలయ ఉద్యోగుల ఆందోళన..
  • పీఆర్సీ ఫిట్ మెంట్ పై ప్రభుత్వ ఉద్యోగుల తిరుగుబావుటా..
  • ధరలేక సుబాబుల్, జామాయిల్ రైతుల కన్నెర్ర..
  • పంట రుణాలు అందక కౌలు రైతుల ఆక్రోశం..
  • పనుల్లేవంటూ భవన నిర్మాణ కార్మికుల నిరాశ..
  • నిత్యావసరాల ధరలు కొండెక్కాయని సగటు ప్రజల పెదవి విరుపు..
  • సరైన మందు దొరకట్లేదు.. అంతా చీఫ్ క్వాలిటీనే.. అంటు మందుబాబుల అసహనం..
  • ఒక్కటేమిటీ..  ఇట్లా అన్నీ జగన్ సర్కారుకు ఒక్కోటి ఎదురుతన్నడం మొదలెట్టాయి..

‘‘మా ప్రభుత్వం బోలెడు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది.. మాకు ప్రజల్లో తిరుగులేని ఆదరాభిమానాలున్నాయి.. ఇదంతా ప్రతిపక్షాల గోల’’ అంటూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ లీడర్లు కొట్టిపారేస్తున్నారు. చాలామంది సీఎం జగన్ చుట్టూ చేరి భజన చేస్తున్నారు. అంతా బ్రహ్మాండంగా ఉందని తెగ మోసేస్తున్నారు.

సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఉద్యోగాలచ్చింది ఈ ప్రభుత్వమే. కానీ, రెండేళ్లయినా వాల్ల ప్రొబెషన్ కొనసాగించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. చాలామంది సచివాలయ ఉద్యోగులు ఆశలు పెంచుకుని, అవి తీరే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మళ్లీ పరీక్ష పాసైతేనే ప్రొబెషన్ పూర్తయినట్టు పరిగణిస్తామని ప్రభుత్వం చెప్పడం.. పూటకో మాట.. రోజుకో ప్రకటన చేయడం సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. ఇప్పుడు మళ్లీ జూన్ దాకా వాయిదా వేయడాన్ని వాళ్లంతా నిరసిస్తున్నారు. నిరసనబాటపట్టారు.

సుబాబుల్, జామాయిల్ టన్నుకు రూ.5వేల ధర ఇప్పిస్తామని అప్పట్లో సీఎం జగన్ రైతులకు హామీ ఇచ్చారు. ఇప్పుడా పరిస్థితులు లేవు. దీంతో మిల్లర్లతో మాట్లాడి హామీ నిలబెట్టుకోవాలంటున్నారు రైతులు. దీనిపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం ఏమైందన్నది ఇంకా ఎటూ తేలలేదు. సీఎం జగన్ ని కలిసి తమ గోడు వెళ్లబోసుకుందాం అనుకుంటే అరెస్టు చేస్తారా అని రైతులు ప్రభుత్వం తీరుపై కన్నెర్ర జేస్తున్నారు. ఎస్ ఎల్ బీసీలో ప్రకటించిన మేరకు కౌలు రైతులకు పంట రుణాలు దక్కలేదు. దీని గురించి పట్టించుకున్న లీడర్లు లేరు, ప్రజాప్రతినిధులైతే అస్సలు లేరు..

ఇక చివరాఖరుకు భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేకుండా పోయాయి. ఇసుక, సిమెంట్, ఐరన్ ధరలు విపరీతంగా పెరిగడమే దీనికి కారణంగా తెలుస్తోంది. బిల్డర్లు పనులు చేపట్టడానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపడం లేదు. చాలా పనులు పెండింగ్ పడ్డాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందికి ఉపాధి లేకుండా పోయింది. కనీసం కార్మికుల ఫండ్ నుంచి అయినా కొంత మొత్తం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

- Advertisement -

ఇంకోవైపు నిత్యావసరాల ధరలు పెరుగుతూ సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం 60 రూపాయలున్న కిలో మంచినూనె పాకెట్ ఇప్పుడు 180 రూపాయలకు చేరింది. ఉల్లిగడ్డలు కిలో రూ.50 నుంచి పైకే వెళ్లాయి. పచ్చిమిర్చి 100కు కిలో.. ఎండు మిర్చి మరింత ఘాటెక్కింది.. చింతపండు మాట చెప్పలేము.. ఇట్లా కనీసం పచ్చిపులుసు చేసుకుని పూట గడుపుదామనుకున్నా సామాన్యుడికి మాత్రం చిల్లర సరుకుల ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. తినడానికి పూట పూటకు ఎంతో ఇబ్బంది పడుతున్నారు.

మరి సీఎం గారూ.. మీ పాలనలో ప్రజలు బాగున్నారని భ్రమపడితే ఎట్లా సార్.. ప్రజల బాగోగులు చూసుకుని, వారిని కాపాడుకుంటేనే మరోసారి అధికారం దక్కుతుంది.. లేకుంటే కష్టమే అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement