Wednesday, January 19, 2022

ఆంజనేయస్వామి దేవాలయంలో చోరీ.. హుండీని దోచేసిన గజదొంగ

ప్రకాశం జిల్లా పొదిలిలోని కాటూరివారిపాలెం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఓ యువకుడు ఆలయంలోకి ప్రవేశించి.. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పక్కకి తప్పించాడు. అనంతరం కానుకల హుండీని పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు. ఆలయంలో ఉన్న ఉన్న మూడు సిసి కెమెరాలు పక్కకి తిప్పి దొంగతనం చేశాడు. అయితే, విగ్రాహానికి ఎదురుగా ఉన్న మరో సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సిసి ఫుటేజ్  పరిశీలిస్తున్నారు. దొంగ కోసం గాలిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News