Tuesday, September 19, 2023

AP: ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ఆలోచ‌న లేదు.. మంత్రి పెద్దిరెడ్డి

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన వైసీపీకి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన వైకాపా సభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్న వేళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ.. ముందస్తుకు వెళ్లే ఆలోచన వైకాపాకు లేదని చెప్పారు. పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయన్నారు. వైకాపా బలంగా ఉందని.. తమకు వేరే పార్టీలతో పొత్తు అవసరం లేదని పెద్దిరెడ్డి చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబు వేరే పార్టీలపై ఆధారపడుతున్నారని.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గురించి తానేమీ మాట్లాడనని వ్యాఖ్యానించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement