చంద్రబాబు లాంటి చీటర్ దేశంలో మరొకరు లేరని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. బుధవారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ… తమ పాలన చూసి చంద్రబాబుకు నవ నాడులు చిట్లి పోయాయంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఛార్జ్‌షీట్‌ను ఆమె పిచ్చికి పరాకాష్టగా అభివర్ణించారు.
600 హామీలు ఇచ్చి, ఆరు హామీలు కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబని, ముఖ్యమంత్రి సంతకాలకు విలువ లేకుండా చేశారంటూ దుమ్మెత్తి పోశారు. ఆస్తి కోసం కుటుంబీకులను వేధించిన వ్యక్తి బోండా ఉమా అన్నారు. అమ్మఒడి పథకాన్ని ఎగతాళి చేసి, ఇప్పుడు మళ్లీ ఆ పథకం ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారో చంద్రబాబు చెప్పాలన్నారు. నాలుగు తరాలు గుర్తు పెట్టుకునే విధంగా జగన్ నాలుగేళ్ల పాలన సాగిందన్నారు. 15 ఏళ్లు సీఎంగా కొనసాగి, తీరా ఇప్పుడు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తాను అంటే టీడీపీని నమ్మేవారు ఎవరూ లేరని రోజా అన్నారు.