Tuesday, November 5, 2024

AP: భక్తుల మనోభావాలపై దాడి జరిగింది.. ప్రశ్నించకుండా ఎలా ఉండగలం.. పవన్

దేవ‌దేవుడు కొలువైన తిరుప‌తిలోనే అ్ర‌క‌మాలు
ఉద్యోగులు ఎందుకు మౌనం వ‌హించారు
ఎవ‌రికి భ‌య‌ప‌డి సైలెంట్ అయ్యారు
త‌ప్పును త‌ప్పు అని చెప్పకుంటే ఎలా
చ‌ర్చిలో, మ‌సీదులో జ‌రిగితే ఊరుకునేవారా
జగన్ తీరు​పై పవన్​ తీవ్ర ఆగ్రహం
తిరుప‌తి ల‌డ్డూ క‌ల్తీపై ప్రాయ‌శ్చిత్తం
11 రోజుల‌పాటు దీక్ష స్వీక‌రించిన ఉప‌ముఖ్య‌మంత్రి


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, విజ‌య‌వాడ‌: ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తిరుమల లడ్డూ కల్తీపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్షను స్వీకరించారు. అంతకుముందు ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 11 రోజుల పాటు దీక్ష అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుపతిలో కల్తీ నెయ్యి అంశంపై దోషులకు శిక్ష పడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అక్రమాలు జరుగుతున్నా, అపవిత్రం చేస్తున్నా టీటీడీ బోర్డు ఏం చేస్తుందని ప్రశ్నించారు.

ఏ మ‌తంపై దాడి జ‌రిగినా ప్ర‌శ్నిస్తాం..
కల్తీ నెయ్యి వ్యవహారం, టీటీడీలో అవకతవకలపై కేబినెట్, అసెంబ్లీలో చర్చ జరగాలని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌ అన్నారు. తమకు ఉపాధి కల్పించిన దేవదేవుడు కొలువైన తిరుపతిలో అక్రమాలు జరుగుతుంటే ఉద్యోగులు ఎందుకు ప్రశ్నించలేకపోయారని అన్నారు. ఈవో ధర్మారెడ్డికి భయపడిపోయారా? అని ప్రశ్నించారు.

- Advertisement -

తప్పును తప్పు అని చెప్పకుంటే ఎలా? జరిగిన దారుణంపై మాట్లాడకుండా ఎలా ఉండగలమని మాజీ సీఎం జగన్​ను ఉద్దేశించి పవన్ ఫైర్ అయ్యారు. కోపం రాదా? వేదన ఉంది. మాట్లాడతాం అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇదే చర్చిలోనో, మసీదులో జరిగితే ఊరుకుంటారా? అని జగన్​ మోహన్ రెడ్డిని నిలదీశారు. ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తాం.. పరస్పర విశ్వాసాలను గౌరవించుకుంటామని పవన్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement