Friday, April 19, 2024

సినీ ఫక్కీలో నగదు చోరీ.. బైకు ట్యాంకు కవర్ లో పెట్టి తీసుకెళ్తుంటే..

ప్రత్తిపాడు, ( ప్రభ న్యూస్) : గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు మండలం, వంగిపురం గ్రామానికి చెందిన ఇక్కుర్తి పెద్దా రావు ప్రత్తిపాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద తన ద్విచక్ర వాహనం కవర్ లో ఉంచిన 4 లక్షల 50 వేల రూపాయలు నగదును 2 నిమిషాల వ్యవధిలోనే గుర్తుతెలియని వ్యక్తి సినిమా పక్కీలో అపహరించుకు పోవడం జరిగిందని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పిర్యాదు ఇచ్చిన వివరాల ప్రకారం మల్లం గురవయ్య అనే అతనికి తను మినుములు అమ్మగా వాటి తాలూకు నగదు 4 లక్షల 50 వేల రూపాయలు మంగళవారం ఉదయం ప్రత్తిపాడు ఎస్.బి.ఐ లో మల్లం గురవయ్య విత్ డ్రా చేసి తనకు నగదు ఇచ్చినట్లుగా తెలిపాడు.

ఇది కూడా చ‌ద‌వండి : సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం : ఎస్పీ రోహిణి ప్రియదర్శిని..

సదరు ఫిర్యాది తన మోటార్ సైకిల్ ట్యాంక్ కవర్ లో పెట్టి 10 మీటర్ల దూరంలో ఉన్న మల్లం గురవయ్య తో 2 నిమిషాలు మాట్లాడి తిరిగి తన బండి దగ్గరకు వచ్చి చూసుకునే టప్పటికి నగదు మాయం అయినట్లు ఎవరో గుర్తుతెలియని దొంగలు దొంగిలించినట్లు ఫిర్యాదు ఇచ్చిన రిపోర్టు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ సిహెచ్ ప్రతాప్ కుమార్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement