Sunday, February 5, 2023

బకాయిల చెల్లింపులపై.. గవర్నర్ ను కలిసిన ఏపీ ఉద్యోగుల సంఘం నేతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించేలా జోక్యం చేసుకోవాలని కోరుతూ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసింది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జి. ఆస్కార్ రావు ఆధ్వర్యంలో మొత్తం 8 మంది ప్రతినిధులు కాసేపటి క్రితం గవర్నర్ ను కలిశారు.

- Advertisement -
   

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోయినా అధికారులు స్పందించడం లేదని, గతంలో ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని ఉద్యోగ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డీఏ, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇప్పటికీ అందడం లేదు. దీనిపై ప్రభుత్వం గతంలో పలుమార్లు హామీలు ఇచ్చినా డబ్బులు మాత్రం రాలేదు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు గవర్నర్ ను ఆశ్రయించారు. ప్రభుత్వం నుంచి పెండింగ్ బకాయిలు ఇప్పించాలని కోరారు. తక్షణం జోక్యం చేసుకుని తమ బకాయిలు ఇప్పించాలని వారు కోరారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు నేతలు చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement