Wednesday, November 6, 2024

AP | తిరుపతి లడ్డూలో యానిమ‌ల్ ఫ్యాట్.. తేల్చిసిన ల్యాబ్ రిపోర్ట్స్

తిరుమల లడ్డూను గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని, లడ్డూ తయారీలో నెయ్యికి బదులు యానిమ‌ల్ ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు అన్నారు. కాగా, ఆ ఆరోపణలకు టీడీపీ ఆధారాలు బయటపెట్టింది. తిరుపతి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిని పరీక్షించిన వివిధ ల్యాబ్‌ల నివేదికలను టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి మీడియాకు విడుదల చేశారు. ఆ రిపోర్టుల్లో టీటీడీకి కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్న నెయ్యిలో కేవలం 19 శాతం మాత్రమే నెయ్యి ఉన్నట్లు తేలింది.

టీటీడీకి సరఫరా అయ్యే నెయ్యిని దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఎన్‌డిడిబి క్యాల్ఫ్ ల్యాబ్‌లో పరీక్షించారు. కాగా, ఆ రిపోర్ట్ ప్ర‌కారం, నెయ్యిలో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వును కూడా వాడినట్లు తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement