Wednesday, March 27, 2024

మొదటి దశలోని ఇళ్లు త్వర‌గా పూర్తి చేయాలి.. అధికారులకు అజయ్‌జైన్‌ ఆదేశం

అమరావతి, ఆంధ్రప్రభ: పేదలందరికీ ఇళ్ళు పథకంలో నిర్మాణంలో ఉన్న గృహాలను ఈ సంవత్సరంలో పూర్తి చేయడానికి ప్రతి ఉద్యోగి నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ సూచించారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ కు 2023వ సంవత్సరం చాలా ముఖ్యమైనడని, ,ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా మొదటి దశలో ప్రారంభించిన గృహాల నిర్మాణాలను పూర్తి చేయాలన్నాకు. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. 2022లో ఉద్యోగులు అంతా సమష్టిగా కృషి చేయడం వలన రెండు లక్షల పదివేలకు పైగా గృహాలను పూర్తి చేయటంతో పాటు మరో ఐదు లక్షలు గృహాలు పూర్తి కావటానికి వివిధ దశలలో ఉన్నాయని, నిర్మాణాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి దీవాన్‌ మైదీన్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం లక్ష్యాలను పూర్తి చేయటానికి ఉద్యోగులంతా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీషా మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలు జరుగుతున్న గృహనిర్మాణ పధకం ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకమైనదని, గృహాల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.శివ ప్రసాద్‌ మాట్లాడుతూ, అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తే సకాలంలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయగసమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement