Friday, April 26, 2024

రైతుబజార్ల సిబ్బంది వేతనాల పెంపు.. 23 శాతం పెంచిన ప్రభుత్వం

అమరావతి, ఆంధ్రప్రభ : రైతుబజార్ల సిబ్బంది వేతనాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇస్తున్న జీతాలను 23 శాతం పెంచింది. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి ఆదేశాలు జారీచేశారు. రైతుబజార్లలో రైతులు, వినియోగదారుల మధ్య వారధిలా పనిచేస్తున్న సిబ్బంది జీతాలను పెంచాలని ముఖ్యమంత్రి జగన్‌ ఇటీ-వల నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు జీతభత్యాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లోని రైతుబజార్ల ఎస్టేట్‌ ఆఫీసర్లకు రూ.21 వేల నుంచి రూ.26 వేలకు, సూపర్‌వైజర్లకు రూ.15 వేల నుంచి రూ.18,500కు వేతనాలు పెరగనున్నాయి.

మిగిలిన కార్పొరేషన్లు, పట్టణాలు, ఇతర ప్రాంతాల్లోని రైతుబజార్లలో ఎస్టేట్‌ ఆఫీసర్లకు రూ.19,500 నుంచి రూ.24 వేలకు, సూపర్‌వైజర్లకు రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెరగనున్నాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా సెక్యూరిటీ గార్డుల వేతనం రూ.12 వేల నుంచి రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపును డిసెంబర్‌ నెల నుంచి అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement