Tuesday, March 26, 2024

మహిళలను, వారి కుటుంబాలను వృద్ధి చేసిన గోల్డ్‌ డ్రాప్‌

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి లోహియా ఎడిబల్‌ ఆయిల్‌ వద్ద సమ్మిళిత ఉద్యోగావకాశాలను అందించడం ద్వారా మహిళలు, వారి కుటుంబాల జీవితాలను గోల్డ్‌ డ్రాప్‌ వృద్ధి చేసింది. ఈసంద‌ర్భంగా సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా మాట్లాడుతూ… తాము కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి మహిళలు, వారి కుటుంబాలలో వెలుగులు తీసుకురావడానికి గోల్డ్‌ డ్రాప్‌ వద్ద ప్రయత్నిస్తూనే ఉన్నామ‌న్నారు. సమ్మిళిత పనివాతావరణం కల్పించినప్పుడు మాత్రమే మంచి అన్నది సాధ్యమవుతుందన్నారు. భారతదేశ వ్యాప్తంగా లింగ వివక్షత అనేది ఉద్యోగాలలో ఉందని త‌మకు తెలుసు కానీ, తాము ఈ అంతరాన్ని వీలైనంతగా తగ్గించడం ద్వారా చేయగలిగినంతగా మంచిని చేయగలుగుతున్నామన్నారు.

త‌మ సిబ్బందిలో చాలామంది త‌మ‌ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వ్యక్తులేన‌న్నారు. త‌మ‌ సిబ్బందిలో మహిళలు ఎక్కువగా ప్యాకేజింగ్‌ విభాగంలో పనిచేస్తుంటారన్నారు. అతి తక్కువ శబ్దం, వేడి, ధూళి రహిత వాతావరణం అక్కడ ఉంటుందన్నారు. దీని వల్ల వారు కంపెనీ కార్యకలాపాలలో అత్యంత కీలకమైన ప్యాకేజింగ్‌ విభాగంలో పూర్తి శ్రద్ధతో కార్యకలాపాలు చేసేందుకు వీలు కలుగుతుందని అన్నారు. గోల్డ్‌ డ్రాప్‌ వద్ద వినియోగదారుల భద్రత అత్యంత కీలకమైన అంశమ‌న్నారు. ఈ ప్యాక్‌లన్నీ కూడా టాంపర్‌ ఫ్రూఫ్‌ సీల్స్‌ కలిగి ఉంటాయన్నారు. ప్యాకేజింగ్‌, స్టోరేజీని పూర్తి ఆరోగ్యవంతమైన ప్రమాణాలలో చేయడం ద్వారా వినియోగదారుల పట్ల సంస్థ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement