Thursday, April 25, 2024

ఆర్టీసీలో 263 అద్దె బస్సులకు టెండర్లు.. టెండరు దాఖలుకు అక్టోబర్‌ 12 ఆఖరి తేదీ

అమరావతి, ఆంధ్రప్రభ: ఆర్టీసీలో 263 అద్దె బస్సుల కోసం అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఇందులో నాలుగు ఏసీ స్లీపర్‌, ఆరు నాన్‌ ఏసీ స్లీపర్‌, 12 సూపర్‌ లగ్జరీ, 15 అల్ట్రా డీలక్స్‌, 30 ఎక్స్‌ప్రెస్‌, 72 పల్లెవెలుగు, 27 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు ఉండగా రెండు సిటీ ఆర్డినరీ బస్సులు ఉన్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) కేఎస్‌ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. జిల్లాల వారీగా శ్రీకాకుళం 23, పార్వతీపురం మన్యం 29, విజయనగరం 12, విశాఖపట్టణం 42, అనకాపల్లి 16, కాకినాడ 35, తూర్పు గోదావరి రెండు, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ 24, పశ్చిమ గోదావరి 29, కృష్ణా నాలుగు, ఎన్‌టీఆర్‌ జిల్లా మూడు, గుంటూరు రెండు, పల్నాడు రెండు, ఎస్‌పీఎస్‌ నెల్లూరు ఐదు, తిరుపతి ఎనిమిది, అన్నమయ్య జిల్లా ఐదు, నంద్యాల మూడు, అనంతపురం ఎనిమిది, శ్రీసత్యసాయి జిల్లాలో 11 బస్సులు సరఫరా చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఔత్సాహికులు ఎంఎస్‌టీఎస్‌ ఈ కామర్స్‌ పోర్టల్‌ ద్వారా తమ శుక్రవారం నుంచి అక్టోబర్‌ 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అక్టోబర్‌ 19న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య రివర్స్‌ ఆక్షన్‌ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో బస్సు రూట్లు, నిబంధనలు, బస్సు స్పెషిఫికేషన్స్‌, టెండరు షెడ్యూల్‌ శుక్రవారం నుంచి అందుబాటులో ఉంటుందని బ్రహ్మానంద రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement