Tuesday, April 23, 2024

పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ పై ఉమ్మడి సర్వే – తెలుగు రాష్ట్రాలకు కేంద్ర జశక్తి శాఖ లేఖలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పై కీలక ఆదేశాలను కేంద్రం జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు కేంద్ర జలశక్తి శాఖ లేఖలు రాసింది. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు పై జనవరి 25న ఢిల్లిలో జరిగిన సమావేశాన్ని గుర్తు చేస్తూ పోలవరం ఉమ్మడి ప్రాజెక్టు పై ఇరురాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ పై ఉమ్మడి సర్వే త్వరగా నిర్వహించాలని తెలుగు రాష్ట్రాలకు కేంద్ర జలశక్తి శాఖ అదేశించింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో ఆధ్రపప్రదేశ్‌ ప్రభుత్వం సమన్వయం చేసుకోవాలని సూచించింది.
పోలవరం ప్రాజెక్టు ను 24 మార్చి లోగా పూర్తి చేయాలని పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర జలశక్తి శాఖసహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే గోదావరి నదికి ఇటీవల వచ్చిన వరదల కారణంగా కొంత ఆలస్యంఅయ్యే అవకాశాలను కూడా ఆయన ప్రస్తావించారు. 2024 మార్చి నాటికి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ నెట్‌ వర్క్‌ ను జూన్‌ 2024 నాటికి మిగతాపనులు పూర్తి చేయడానికి షెడ్యూల్డ్‌ చేశారు. అయితే తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈలోగా కనుగొనాల్సిఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర,తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ఉమ్మడిసర్వే నిర్వహించి కేంద్ర జలశక్తికి నివేదికలు సమర్పించాల్సి ఉంది. జనవరి 25న ఉమ్మడి సర్వేకు ఆంధ్ర తెలంగాణ అంగీకరించినప్పటికీ ఇప్పటివరకు పనుల్లో వేగం పెరగపోవడంతో త్వరగా సర్వే పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి ఇరురాష్ట్రాల నీటిపారుదల శాఖలను ఆదేశిస్తూ లేఖలు రాసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement