Friday, April 19, 2024

తెలుగోళ్ల‌కు ‘జీ’హుజుర్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ 2023 తొలివిడత పరీక్షా ఫలితాలు మంగళవారం ఉదయం విడుదల య్యాయి. జేఈఈ-2023 మెయిన్‌ తొలి విడత ఫలితాలకు సంబంధించి.. నేషనల్‌ -టె-స్టింగ్‌ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. విడుదలైనఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన జేఈఈ-2023 మెయిన్‌ తొలి విడత ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల్ర విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. ఎన్‌టీ-ఏ విడుదల చేసిన పేపర్‌ -1 (బీఈ, బీ-టె-క్‌) ఫలితాల్లో టాప్‌ -20 విద్యార్థుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఐదుగురు ఉన్నారు. దేశవ్యాప్తంగా 20మంది విద్యార్థులు 100 పర్సం-టైల్‌ సాధించగా.. ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాల్రకు చెందిన వావిలాల చిద్విలాస్‌ రెడ్డి, దుగ్గినేని వెంకట యుగేశ్‌, గుత్తికొండ అభిరామ్‌, బిక్కిన అభినవ్‌ చౌదరి, అభినీత్‌ మాజేటి నిలిచి తమ సత్తాను చాటు-కున్నారు.


ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో జరిగిన జేఈఈ మెయిన్‌- 2023 తొలి విడత పరీక్షలు రాసేందుకు దేశ వ్యాప్తంగా దాదాపు ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 6 నుంచి 12వరకు జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు జరగనున్నాయి. తొలి విడత రాసిన విద్యార్థులు.. రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష తర్వాత ఎన్‌టీ-ఏ ఆల్‌ ఇండియా ర్యాంకుల్ని ప్రకటిస్తుంది. ఆ తర్వాత విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రవేశాల ప్రక్రియను చేపట్టనున్నారు.

ఫలితాలు విడుదల:
జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎన్‌టీ-ఏ జేఈఈ మెయిన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను తెలుసుకోవచ్చు. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీని ఎంటర్‌ చేసి ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో జరిగిన జేఈఈ మెయిన్‌- 2023 తొలి విడత పరీక్షను 8.22లక్షల మంది రాశారు.
నేషనల్‌ -టె-స్టింగ్‌ ఏజెన్సీ సోమవారం ఉదయమై ఫైనల్‌ కీని విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ ఫలితాల కోసం ఎన్‌టీ-ఏ వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. ఫలితాల కోసం అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ తప్పనిసరి. గత నెల జనవరి 24 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు జేఈఈ మెయిన్‌ 2023 తొలి విడుత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 8.5లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. మరో వైపు జేఈఈ మెయిన్‌ రెండో విడుత పరీక్షలను ఏప్రిల్‌ 6 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనుండగా.. రిజిస్ట్రేష్రన్‌ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. తొలి విడుత పరీక్ష రాసిన విద్యార్థులు కూడా రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement