Tuesday, December 3, 2024

Telangana – స్కిల్ వ‌ర్శిటీ లో ఆరు కోర్సులు… త‌ర‌గ‌తుల ఎప్ప‌టి నుంచి అంటే ….

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు రూపు దిద్దుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా పలు రంగాల్లో కోర్సులను దసరా పండగ నుంచి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా దాదాపు 20 కోర్సులను నిర్వహించాలని గుర్తించడం జరిగిందని, వీటిలో దసరా పండగ నుంచి ప్రాథమికంగా ఆరు కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

ఈ స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై నేడు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎస్. శాంతి కుమారి మాట్లాడుతూ.. ముచ్చర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని, ఈ నిర్మాణ పనులు ముగిసేంత వరకు ఈ యూనివర్సిటీని తాత్కాలిక భవనంలో నిర్వహించనున్నట్టు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement