Wednesday, April 17, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదరించిన ఉపాధ్యాయులు.. సజ్జల

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఉపాధ్యాయులు బాగా ఆద‌రించార‌ని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… తొలిసారి రెండు టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలు గెలవడం త‌మకు పెద్ద విజయమన్నారు. లెఫ్ట్‌ పార్టీల ఓట్లు టీడీపీకి వెళ్తాయన్నారు. ఈ ఫలితం ఏరకంగానూ ప్రభావం చూప‌దన్నారు. టీడీపీ బలం పెరిగిందనడం హాస్యాస్పదమన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇంకా ఫలితాలు వెలుబడాల్సి ఉంది. త‌మ అభ్యర్థి కౌంటింగ్‌ అవకతవకలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఓట్ల బండిల్లో ఏదో గందరగోళం జరిగింది. టీడీపీ వ్యవస్థలను ఎలా మేనేజ్‌ చేయాలో అలవాటు పడింది. ఆ అలవాటు పోవడం లేదు. గ్రాడ్యుయేట్‌ ఎన్నికలకు సంబంధించి.. సహాజంగానే కమ్యూనిస్టులు, అసోసియేషన్లు పోటీ చేస్తుంటాయి. ప్రధాన పార్టీలు మద్దతుగా ఉంటాయి. చిన్న సెగ్మెంట్‌ కావడంతో రెండు స్థానాల్లో వెనుకబడ్డాం. దీన్ని చూసి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో దీనిపై కూడా దృష్టి పెడతామ‌న్నారు.

టీచర్ల ఎమ్మెల్సీలో తొలిసారిగా వైయస్‌ఆర్‌సీపీ మద్దతుదారులు రెండు చోట్ల విజయం సాధించార‌న్నారు. ఈసారి కమ్యూనిస్టు పార్టీల మధ్య అండర్‌స్టాండింగ్‌తో టీడీపీకి ట్రాన్స్‌ఫర్‌ చేశాయన్నారు. అన్ని శక్తులు ఏకమయ్యాయి. ఒక సెగ్మెంట్‌లో ఈ ప్రభావం కనిపించిందన్నారు. యాక్టివ్‌గా ఉన్న ఏరియా టీడీపీకి సపోర్టుగా నిలిచారన్నారు. ఎన్నికలు జరిగిన అన్ని స్థానాలు గమనించాలని, అద‌నంగా తాము టీచర్ల స్థానంలో విజయం సాధించామ‌న్నారు. అన్ని వర్గాల ప్రజలు మమ్మల్ని ఆదరించారన్నారు. ఏ వర్గాలను తాము ప్రభావితం చేశామో ఆ ఓటర్లు ఈ సెగ్మెంట్‌లో తక్కువగా ఉన్నారన్నారు. ఈ ఫలితాలు చూసి నిజంగా టీడీపీ బలం పెరిగిందని సంబరాలు చేసుకోవడం, దీంతోనే అంతా అయిపోయిందని, శక్తి పెరిగిందని భావిస్తే ఆది వాళ్ల ఆనందంగానే చూడాలన్నారు. సొసైటీలో ఉన్న అన్నివర్గాల ఓటర్లు ఎన్నికలో పాల్గొంటే అప్పుడు అంచనా వేయవచ్చన్నారు. ఇటీవల జరిగిన లోకల్‌ బాడీ ఎన్నికలు గమనిస్తే స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో కూడా త‌మకు తక్కువ రాలేదన్నారు. టీడీపీకి బయటి శక్తులు సపోర్టు చేయడంతో ఈ ఫలితాలు సాధించిందన్నారు. మొదటిసారిగా తాము టీచర్ల ఎమ్మెల్సీలో రెండు స్థానాలు గెలుచుకున్నాం. త‌మకు సంతృప్తికరంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement