Friday, March 29, 2024

ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ ఎం ఎల్ సి స్థానాలు టీ డీ పీ కైవసం

అమరావతి – ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల(గ్రాడ్యుయేట్‌) ఎం ఎల్ సి ఎన్నికల్లో తెదేపా సత్తా చాటింది. ఉత్తరాంధ్ర తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు రెండో ప్రాధాన్య ఓటుతో విజయదుందుభి మోగించారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల్లో తెదేపా అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ గెలుపొందారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో మొదటి రౌండ్‌ నుంచి ఆధిక్యం కనబరిచిన చిరంజీవిరావు గెలుపునకు అవసరమైన కోటా ఓట్లను సాధించి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి చిరంజీవిరావుకు 82,958 ఓట్లు, వైకాపా అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కు 55,749 ఓట్లు, పీడీఎఫ్‌ అభ్యర్థి రమాప్రభకు 35,148 ఓట్లు, భాజపా అభ్యర్థి పీవీఎన్‌ మాధవ్‌కు 10,884 ఓట్లు పోలయ్యాయి. చిరంజీవిరావు విజయం సాధించేందుకు ఇంకా 11,551 ఓట్లు కావాల్సి ఉండటంతో అధికారులు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌.. వైకాపా అభ్యర్థి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిని ఓడించారు. శ్రీకాంత్‌ గెలుపును రిటర్నింగ్‌ అధికారి అధికారికంగా ప్రకటించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement