Tuesday, March 26, 2024

ఏపీలో రేషన్ డీలర్ల ఆందోళన.. టీడీపీ సంపూర్ణ మద్దతు

ఏపీలో రేషన్ డీలర్లు ఆందోళన బాటపట్టారు. విజయవాడలోని పౌర సరఫరాల శాఖ గోడౌన్ వద్ద రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. జీవో నెంబర్ 10 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గన్నీ బ్యాగులకు డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో డీలర్లు ఆర్ధికంగా మరింత నష్టపోతారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహణ ఖర్చులు కూడా రాకపోతే రేషన్ షాపులు ఎలా నడపాలని ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే డీలర్లు తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని నిలదీస్తున్నారు.

రేషన్ డీలర్ల ఆందోళనకు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. డీలర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. వాలంటీర్లు, మొబైల్ వాహనాలతో డమ్మీలుగా రేషన్ డీలర్లు ఉన్నారని తెలిపారు. కరోనా సమయంలో జగన్ ఉచిత రేషన్ కమిషన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 54 మంది డీలర్లు కరోనాతో మృతి చెందినా పరిహారం ఇవ్వలేదన్నారు. టీడీపీ హయాంలో మినీ సూపర్ మార్కెట్లుగా రేషన్ షాపులు ఉన్నాయన్న అచ్చెన్న.. నేడు బియ్యం, పంచదార, పప్పులకు జగన్ పరిమితం చేశారని అచ్చెన్న ఆరోపించారు.

ఇది కూడా చదవండి: ఏపీలో చెత్తపై పన్ను ఎందుకో చెప్పిన ఎమ్మెల్యే రోజా

Advertisement

తాజా వార్తలు

Advertisement