Thursday, September 16, 2021

నారా లోకేష్ పెద్ద మనసు.. 8 ఏళ్ల బాలుడికి సాయం

తెలుగుదేశం పార్టీ జాతీయ‌ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ పెద్ద మనసు చాటుకున్నారు. ఆటో న‌డుపుతున్న చిత్తూరు జిల్లాకి చెందిన‌ 8 ఏళ్ల బాలుడు గోపాలరెడ్డి కుటుంబానికి సాయం అందించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండ‌లం గంగుడుప‌ల్లె గ్రామానికి చెందిన‌ గోపాల‌రెడ్డి బ్యాట‌రీ ఆటో న‌డుపుతూ అందులో ప‌ప్పులు, ఉప్పులు ఊరూరా తిరిగి అమ్ముతున్నాడు. కళ్లులేని త‌ల్లిదండ్రులు, లోకం పోక‌డ తెలియ‌ని ఇద్దరు త‌మ్ముళ్లకు తానే పెద్దదిక్కయ్యారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన వెంట‌నే స్పందించిన నారా లోకేష్.. సాయం అందించేందుకు ముందుకొచ్చారు. 8 ఏళ్ల వ‌య‌స్సులో కుటుంబ‌ బ‌రువు బాధ్యత‌ల్ని మోస్తోన్న బాలుడి క‌ష్టాలు చూసి నారా లోకేష్ చ‌లించిపోయి సాయం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సాయం చేశారు. ఈ విషయాన్ని లోకేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తన టీమ్ ఆ కుటుంబాన్ని కలిసిందని.. ఆ పిల్లల చదువుకు సంబంధించిన ప్లాన్ సిద్ధం చేసిందన్నారు. అలాగే ఆటో లోన్ క్లియర్ చేసేందుకు రూ.50వేలు ఇచ్చినట్లు, ఫండ్ రైజ్ చేసినట్లు లోకేష్ చెప్పారు.

ఈ వార్త కూడా చదవండి: ఒక్కరు చాలు.. ఇద్దరు వద్దు: బండి సంజయ్

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News