Wednesday, March 27, 2024

సినిమాల కోసం విలువలు వదులుకుంటారా?: Jr.NTRపై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్య

ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు సతీమణిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను నందమూరి ఫ్యామిలీ ఖండించిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సహా కుటుంబ సభ్యులు అందరూ స్పందించారు. అయితే, ఈ విషయంపై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్ విఫలమయ్యారని, మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని తెలుగు జాతి భావిస్తోందని పేర్కొన్నారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలలను వదులుకుంటారా? అని వర్ల రామయ్య ప్రశ్రించారు. వైసీపీ నేతలు రోజు రోజుకీ రెచ్చిపోతున్నార‌ని మండిపడ్డారు. చంద్ర‌బాబు నాయుడి కుటుంబానికి సీఎం జ‌గ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని వ‌ర్ల రామ‌య్య డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నవాళ్లే టీడీపీ సభ్యులని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement