Thursday, April 25, 2024

ఆనందయ్య మందు అమ్ముకోవడానికి కుట్రలు: మాజీ మంత్రి సోమిరెడ్డి..

నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేదం మందు చారిత్రాత్మక ఘటనగా మారిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.అందుకే ఆనందయ్య మందును అమ్ముకోవాలని కుట్రలు మొదలైనాయని అన్నారు. childeal.com వెబ్ సైట్ ను godaddy నుంచి శ్రేశిత టెక్మాలజీ వారు కొన్నారని. శ్రేశిత టెక్మాలజీ డైరెక్టర్లు వైసీపీ వారేనని..మూడు మందులను ఒక్కోక్క రేటు చొప్పున అమ్మాలని childeal.com లో పెట్టారని సోమిరెడ్డి ఆరోపించారు. తన మందుని ఆన్లైన్ లో అమ్మేందుకు ఆనందయ్య ఒప్పుకోలేదని..ఆనందయ్య కుమారుడే స్వయంగా చెప్పాడని సోమిరెడ్డి అన్నారు. ఈ నకీలి వెబ్ సెట్ ను నమ్మోదని ఓ కుటుంబం తయారుచేసిన మందును కాకాణి ఎలా అమ్ముతాడని ప్రశ్నించారు. ఆనందయ్య మందుని సోమ్ము చేసుకోవాలని కాకాణి గోవర్థన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడని… నకీలీ వెబ్ సైట్లు సృష్టించి అమ్మాలని చూశాడు. దీనిపై తాము సైబర్ క్రైం కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇక ఆనందయ్యను ఎందుకు నిర్భందించారో కూడా చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement