Thursday, April 25, 2024

సర్పంచ్‌ లకు చెక్ పవర్ ఇవ్వండి: రాజేంద్ర ప్రసాద్

మూడు నెలల క్రితం నూతనంగా ఎన్నికైన 12 వేల మంది సర్పంచ్‌లకు ఇంత వరకూ చెక్ పవర్ ఇవ్వకపోవడాన్ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ తీవ్రంగా ఖండిస్తోందని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి 12 వేల గ్రామాల్లో చేపట్టాల్సిన పారిశుధ్ధ్య పనులకు నిధులు రాక సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సీఎఫ్ఎమ్ఎస్ ఖాతా కింద ఉన్న గ్రామ పంచాయతీ నిధులు, 14, 15వ ఆర్థిక సంఘం నిధులను సుమారు 3 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన స్వంత అవసరాలకు వాడేసుకుందని ఆరోపించారు. అందుకే సర్పంచ్‌ లకు చెక్ పవర్ ఇవ్వడం లేదా? అని ప్రశ్నించారు. కరోనా నివారణ చర్యలు చేపట్టలేక సర్పంచ్‌ లు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారని పేర్కొన్నారు. గ్రామ పంచాయితీలు నిర్వీర్యం అవడంతో గ్రామీణ ప్రజలు కరోనా బారినపడి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇచ్చి గ్రామీణ ప్రజల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement