Monday, July 26, 2021

అక్రమ మైనింగ్ పై అన్ని అధారాలు ఉన్నాయి: నక్కా

మన్యంలో జరుగుతున్న అక్రమ మైనింగ్​పై టీడీపీ వద్ద అన్ని అధారాలు ఉన్నాయని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దు మన్యంలో జరుగుతున్న అక్రమ మైనింగ్​పై రేపు న్యాయస్థానాల్లో నిలబడేది అధికారులేనని హెచ్చరించారు. లాటరైట్ ముసుగులో జరుగుతున్న బాక్సైట్ అక్రమ మైనింగ్​కు సంబంధించి తమ వద్ద పూర్తి స్థాయిలో అధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. క్రిందిస్థాయిలో పర్యావరణ, అటవీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు కుమ్మక్కై అక్రమ మైనింగ్ ఆదాయాన్ని పంచుకునేందుకు సిద్ధపడ్డారా అని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్​పై గిరిజనులు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని ధ్వజమెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News