Tuesday, April 23, 2024

ఏపీ గవర్నర్ ను అప్పుల ఊబిలోకి నెట్టారు: వైసీపీ సర్కార్ పై గోరంట్ల ఫైర్

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాన్ని వైసీపీ సర్కార్ అప్పులో ఊబిలో పడేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా దివాళా దిశగా పయనిస్తోందని, ఏపీ అప్పులమయం కావడంతో చీకట్లు కమ్ముకొస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆఖరికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కూడా ఈ ప్రభుత్వం తమ స్వార్ధానికి బలి చేసిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్​గా పదవీ విరమణ చేశాక కూడా.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చమని ఆయనకు నోటీసులిచ్చే దుస్థితి తెచ్చారని ధ్వజమెత్తారు. గవర్నర్ వ్యక్తిగత పేరుతో అప్పులు తెచ్చి, ఆయన్ని కూడా ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. గవర్నర్ పేరుతో పరిపాలన నడుస్తున్నా.. ఆయన వ్యక్తిగత పేరుకు, అప్పులకు ఏం సంబంధం ఉందో బుగ్గన సమాధానం చెప్పాలని గోరంట్ల డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి గవర్నర్ అధికారులను పిలిచి మందలించే వరకు వచ్చిందని పేర్కొన్నారు. కోట్లలో అప్పులు చేస్తూ సకాలంలో ఉద్యోగులకు జీతాలు ఎందుకు చెల్లించలేక పోతున్నారని గోరంట్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్ని అప్పులు తెస్తున్నా.. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.

ఇది కూడా చదవండి: అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ వాయిస్.. నిజమైన బండి సంజయ్ జోస్యం!

Advertisement

తాజా వార్తలు

Advertisement