Thursday, March 28, 2024

Breaking: టీడీపీకే కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం?.. ఫలితంపై వీడని టెన్షన్!

ఆంధ్రప్రదేశ్ లో ఉత్కంఠ రేపిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. హైకోర్టు ఆదేశాలతో కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ పూర్తి అయ్యింది. టిడిపి తరపున చైర్మెన్ అభ్యర్థిగా చిట్టి బాబు బరిలో ఉండగా.. అధికార వైసీపీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా… జోగు రాము పోటీ చేశారు. ఈ ఎన్నికను పూర్తిగా వీడియో తీశారు.

ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి 16 ఓట్లు రాగా.. అధికార వైసీపీ పార్టీకి 15 ఓట్లు వచ్చాయి. ఇక టిడిపి తరఫున ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎంపీ కేసినేని నాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు వైసీపీ పార్టీ తరఫున ఎక్స్ అఫీషియో సభ్యుడిగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేశినేని నాని ఎక్స్అఫిషియో విషయంలో వైసిపి వ్యతిరేకించినప్పటికీ… ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఈ ఫలితాలను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు తెలపనున్నారు. హైకోర్టు ఆదేశాలు అనంతరం ఫలితాలు బయటపడుతున్నాయి. అయితే పోలైన ఓట్ల ప్రకారం తెలుగుదేశం పార్టీ కొండపల్లి మున్సిపాలిటీ పై జెండా ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తోంది.

కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ పరిధిలో మొత్తం 29 వార్డులు ఉన్నాయి. ఇందులో టీడీపీకి 15 మంది, వైసీపీకి 14 మంది కౌన్సిలర్ల బలం ఉంది. చైర్మన్ ఎన్నిక సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకోవడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కారణంగానే గత రెండురోజులుగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడుతోంది. దీంతో కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిపించాలంటూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్ పై నిన్న హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు నిర్వహించారు. ఎక్స్ అఫిషియో ఓట్ల అనంతరం టీడీపీ బలం 16కి, వైసీపీ బలం 15కి పెరిగింది. ఈ నేపథ్యంలో చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement