Wednesday, April 24, 2024

తిరుపతిలో బాలకృష్ణ ప్రచారం

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలలో ప్రచారం చేయబోయే టిడిపి స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదలైంది. లోక్‌సభ ఉప ఎన్నిక బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి మద్దతుగా ఆ పార్టీ నేత, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు తో సహా మరో 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను సిద్ధం చేసిన టీడీపీ దానిని ఎన్నికల సంఘానికి పంపింది. ఆ జాబితా లో చంద్రబాబునాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బాలకృష్ణ సహా 9 మంది పొలిట్ బ్యూరో సభ్యులు, ఐదుగురు ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement