Thursday, April 25, 2024

కొండపల్లి మున్సిలిపాటీ: చైర్మన్ పదవిపై ఉత్కంఠ.. ఎక్స్‌ అఫీషియో ఓట్లే కీలకం

కృష్ణా జిల్లాలోని కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుంది అన్నది ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 14, టీడీపీ 14 స్థానాలు గెలిచాయి. ఇరుపార్టీలకు సమానంగా వార్డులు గెలవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థి కీలకంగా మారారు. అధికార వైసీపీకి మద్దతు ఇస్తారాని అంతా భావించారు. అయితే,

ఇండిపెండెంట్‌ అభ్యర్థి శ్రీ లక్ష్మి అందరికీ షాక్‌ ఇస్తూ టీడీపీలో చేరారు. దీంతో కొండపల్లిలో టీడీపీ వార్డు సభ్యుల సంఖ్య 15కి చేరింది. అయితే కొండపల్లి చైర్మన్‌ ఎన్నికలో ఎక్స్‌ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో టీడీపీ, వైసీపీలు చైర్మన్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారు అన్నది ఆసక్తి నెలకొంది. కొండపల్లి చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ, వైసీపీలు వ్యూహాలు రచిస్తున్నాయి.

కాగా, కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అయితే కౌంటింగ్‌ లో వైసీపీ, టీడీపీలు సమానంగా సీట్లు గెలుచుకున్నాయి. అధికార వైసీపీ పార్టీ 14 సీట్లు గెలుచుకోగా…టీడీపీ కూడా 14 స్థానాల్లో విజయం సాధించింది. స్వంతంత్ర అభ్యర్థి ఓ చోట గెలిపొందారు. అయితే, ఇండిపెండెంట్ అభ్యర్థి టీడీపీలో చేరడంతో ఆపార్టీ బలం 15కి చేరింది. ఈ నేపథ్యంలో మున్సిపాల్‌ ఛైర్మన్‌ పదవిపై తీవ్ర సందిగ్ధత నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/andhraprabhanewsdaily

- Advertisement -

https://twitter.com/AndhraPrabhaApp,

Advertisement

తాజా వార్తలు

Advertisement