Thursday, April 25, 2024

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ వ్యవసాయ స్టీరింగ్‌ కమిటీ పర్యటన..

అమరావతి, ఆంధ్రప్రభ: అసాని తుపాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను టీడీపీ వ్యవసాయ స్టీరింగ్‌ కమిటీ పరిశీలిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఈ కమిటీ కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని తోటవల్లూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలించి నివేదిక రూపొందిస్తుందని తెలిపారు. అనంతరం నష్టపోయిన రైతులను పరామర్శిస్తుందన్నారు. ఈ స్టీరింగ్‌ కమిటీలో సభ్యులుగా టీడీపీ సీనియర్‌ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ప్రత్తిపాటి పుల్లారావు, జ్యోతుల నెహ్రూ, ధూళిపాళ్ల నరేంద్ర, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్థన్‌ రెడ్డి, కూన రవికుమార్‌, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఉంటారని తెలిపారు.

ప్రజాగొంతుక నరసింహారావు మృతి బాధాకరం: అచ్చెన్నాయుడు

ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు నరసింహారావు మృతి బాధాకరమని అచ్చెన్నాయుడు అన్నారు. సమకాలీన రాజకీయ విశ్లేషణలో నరసింహారావు తనదైన ముద్ర వేశారని, ప్రజల పక్షాన మాట్లాడే ప్రజాగొంతుకగా నరసింహారావు కొనసాగారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిర్ద్వంద్వంగా ఖండించిన వ్యక్తి అని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటు-ంబ సభ్యులకు, మిత్రులకు మనోధైర్యం ఇవ్వాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నానని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement