Monday, November 11, 2024

AP | విశాఖలో టీసీఎస్ పెట్టుబ‌డులు..

విశాఖప‌ట్నంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు టాటా కంపెనీ ముందుకు వ‌చ్చింద‌ని ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖ‌లో టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీస్ (టీసీఎస్) ఏర్పాటు కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. టాటా కంపెనీ భారీ పెట్టుబ‌డుల‌తో మెరుగైన జీత‌భ‌త్యాలతో దాదాపు 10 వేల ఐటీ ఉద్యోగాలు యువ‌త‌కు ల‌భిస్తాయని వెల్ల‌డించారు.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి రావడంతో ఏపీ ప్రభుత్వం స్వాగతం పలుకుతోంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిపేందుకు టీసీఎస్‌ వంటి ప్రముఖ సంస్థ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించడంపై సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement