Friday, April 19, 2024

Breaking: నటుడు తార‌క‌ర‌త్నకు తీవ్ర అస్వస్థత

తిరుపతి, రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ ఈ ఉదయం యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. అయితే ఈ పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. పాదయాత్ర ప్రారంభమయ్యాక కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేశ్ ప్రార్థన నిర్వహించగా తారకరత్న కూడా పాల్గొన్నారు. లోకేశ్ మసీదు నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా టిడిపి కార్యకర్తలు తరలి రావడంతో వారి తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో తార‌క‌ర‌త్న‌ను కుప్పం కేసీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇదే పాదయాత్రలో పాల్గొన్నహిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ విషయం తెలిసిన వెంటనే కేసీ ఆస్పత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.. ఎండ వేడికి డి హైడ్రేషన్క్ గురయ్యారని వైద్యులు వెల్లడించారు.

అంతకు ముందు ఉదయం లక్ష్మీ పురంలోని వరదరాజస్వామి ఆలయంలో పూజలు చేశారు. లోకేష్ సమీపంలోని మసీదులో, బాబు నగర్ హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ప్రార్ధనలు చేసి నిర్దేశిత ముహూర్తం ప్రకారం 11.03 గంటలకు పాదయాత్ర మొదలు పెట్టారు మామగారైన నందమూరి బాలకృష్ణ, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు వెంట రాగా.. లోకేష్ పాదయాత్రకు విశేష సంఖ్యలో తరలి వచ్చిన కార్యకర్తల, అభిమాన జన సందోహంతో ఆర్భాటంగా మొదలైంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement