Friday, April 26, 2024

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు

ఏపీలో టీడీపీ నేతలే టార్గెట్ గా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నట్లు ఆరోపణలో విపిస్తున్నాయి. ఇటీవల కొండపల్లిలో అక్రమ మైనింగ్ పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఐపీసీ 153A, 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది.

కాగా, శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన తాడిపత్రి మున్సిపల్‌ రెండవ వైస్‌ చైర్మన్ ఎన్నికలో టీడీపీ మద్దతు ఇచ్చిన అబ్దుల్‌రహీం విజయం సాధించారు. ఆ తర్వాత జేసీ ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజకీయం ఏమిటో ఇక నుంచి తాను చూపిస్తానంటూ వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని హెచ్చరిస్తూ మీసం మెలేశారు. టీడీపీ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌.. వైస్‌ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకొని తన సత్తా ఏమిటో పెద్దారెడ్డికి మరోసారి నిరూపించానని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తాను గానీ, కొడుకు, భార్య గానీ తమ తడాఖా ఏమిటో జేసీ సోదరులకు చూపిస్తామని ప్రగల్భాలు పలికిన పెద్దారెడ్డి చివరికి బొక్కబోర్లా పడ్డారని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement