Saturday, October 12, 2024

మహా కుంభాభిషేకంలో స్వరూపానందేంద్ర సరస్వతి

పెదకాకాని, జూన్ 1 (ప్రభ న్యూస్) ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన పెదకాకాని మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మహా కుంభాభిషేకం ప్రత్యేక పూజలు గురువారం ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యములు, వేద పారాయణ, గోపూజ, గురు పూజ, అంతరాలయ మూల గణపతికి విశేష అర్చన, వాస్తు పూజ శాస్త్రవేత్తంగా నిర్వహించారు. మూడవ తేదీన మహా కుంభాభిషేకం సందర్భంగా విశాఖ శారద పీఠాధిశ్వరులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఆలయానికి రావడం జరిగింది. ప్రారంభ పూజలు స్వాత్మానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా జరిగాయి. పొన్నూరు శాసనసభ్యులు కిలారి వెంకట రోశయ్య దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ,దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement