Saturday, April 20, 2024

అనుమానం ఉంటే.. డాక్ట‌ర్‌ను క‌ల‌వండి

  • వైద్యాధికారి దివ్య‌
  • తిరువూరు: క్షయవ్యాధి సోకినట్లు అనుమానం కలిగితే వెంటనే సమీపంలోని ప్రభుత్వాసుపత్రిలో సంప్రదించాలని కృష్ణా జిల్లా తిరువూరు అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్ వైద్యాధికారి డాక్టర్ దివ్య వాడపల్లి అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా తిరువూరు యూపీహెచ్సీ సిబ్బంది గురువారం పట్టణంలో ప్రదర్శన జరిపారు. రెండు వారాలు మించి దగ్గు, రాత్రి వేళల్లో జ్వరం, కళ్ళెలో రక్తం పడడం, శరీర బరువును కోల్పోవడం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. వైద్యుని సలహా మేరకు డాట్ ప్రొవైడర్స్ చికిత్సతో పాటు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చునని దివ్య తెలిపారు. ఈ కార్య‌క్ర‌క‌మం చౌటపల్లి పీ హెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ కే గంగాధర్ కుమార్ ఆధ్వర్యంలో జ‌రిగింది.
Advertisement

తాజా వార్తలు

Advertisement