Friday, April 26, 2024

ఏపీ ప్రభుత్వాన్ని అభినందించిన సుప్రీం కోర్టు

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు స్వాగతించింది. సీబీఎస్ఈ పరీక్షల రద్దు అంశంపై శుక్రవారం విచారణ సందర్భంగా.. ఏపీ పరీక్షల రద్దు విషయాన్ని ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పరీక్షల నిర్వహణకు సిద్ధమైనప్పటికి సుప్రీం ఆదేశాలతోనే పరీక్షలు రద్దు చేశామన్నారు. పది రోజుల్లో హైపవర్ కమిటీ అసెస్‌మెంట్ స్కీమ్‌ను రూపొందించి జూలై 31 లోపు ఫలితాలను ప్రకటిస్తామని వివరించారు.

ఇదీ చదవండి: ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు!

Advertisement

తాజా వార్తలు

Advertisement