Monday, July 26, 2021

గ్రామ సచివాలయంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..

కర్నూలు జిల్లా నంద్యాల రూరల్ లోని మిట్నాల గ్రామము సచివాలయంలో సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కోవిడ్ థర్డ్ వేవ్ రానుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సచివాలయం పరిధిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ను పరిశీలించారు..ఎంత మందికి వ్యాక్సిన్ వేయించారు ఇంకా ఎంతమందికి వేయించాలి.. కోవిడ్ టీకా ఎన్ని డోస్ లు అందుబాటులో ఉన్నాయి అని వివరాలు తెలిపే చార్ట్ ను ఏర్పాటు చేయాలన్నారు సబ్ కలెక్టర్. కోవిడ్ నివారణ సూచనలు పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. గ్రామము లోని పింఛన్ లబ్ధిదారులకు నెలనెల అందుతుందా లేదా అనే వివరాలు తెలుసుకున్నారు.

ఇది కూడా చదవండి: జగన్ ను నమ్ముకుంటే జైలుకే.. అధికారులకు చంద్రబాబు వార్నింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News