Friday, April 26, 2024

అనంతపురంలో నీటి ఎద్దడి.. దీక్షలు చేస్తున్న కార్మికులు

అనంతపురం జిల్లాలో వర్షాలు భారీ కురిసి నప్పటికీ తాగునీటి తిప్పలు తప్పడం లేదు. దీనికి  భూగర్భ జలాలు కారణం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా.. ఒకటి,రెండు నియోజకవర్గాలకు మినహా అన్ని గ్రామాలు, పట్టణాలకు సత్యసాయి తాగునీటి పథకం ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పిఏబిఆర్, చిత్రావతి జలాశయాల నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని అందిస్తున్నారు. నీటిని వదిలేందుకు వెయ్యి మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరి గడిచిన కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో, భార్యా పిల్లలతో  సత్యసాయి వాటర్ ప్రాజెక్టు వద్దకు వచ్చి సామూహిక దీక్షలు చేస్తున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో వారం రోజులుగా నీళ్లు రాక  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీతాలు ఇచ్చే వరకు తాము విధుల్లోకి చేరమని కార్మికులు కరాఖండిగా తేల్చి చెప్పారు. దీంతో పల్లెలో నీటి ఎద్దడి నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement